కీర్తనల గ్రంథము - అధ్యాయము 61

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150
← ముందునది తదుపరి →
1 దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము
2 నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను నేను ఎక్కలేనంతయెత్తయిన కొండపైకినన్ను ఎక్కిం చుము.
3 నీవు నాకు ఆశ్రయముగా నుంటిని. శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి
4 యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును (సెలా.)
5 దేవా, నీవు నా మ్రొక్కుబడుల నంగీకరించి యున్నావు నీ నామమునందు భయభక్తులుగలవారి స్వాస్థ్యము నీవు నాకనుగ్రహించి యున్నావు.
6 రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక అతని సంవత్సరములు తరతరములుగడచును గాక.
7 దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమిం చుము.
8 దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించు నట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను.
← సూచికకు తిరుగు