కీర్తనల గ్రంథము - అధ్యాయము 124

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150
← ముందునది తదుపరి →
1 మనుష్యులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల
2 వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు
3 యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు
4 జలములు మనలను ముంచివేసి యుండును ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లిపారి యుండును
5 ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక.
6 వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక.
7 పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొని యున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము.
8 భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
← సూచికకు తిరుగు