కీర్తనల గ్రంథము - అధ్యాయము 120

123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150
← ముందునది తదుపరి →
1 నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను.
2 యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము.
3 మోసకరమైన నాలుకా, ఆయన నీకేమి చేయును? ఇంతకంటె అధికముగా నీకేమి చేయును?
4 తంగేడునిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును
5 అయ్యో, నేను మెషెకులో పరదేశినై యున్నాను. కేదారు గుడారములయొద్ద కాపురమున్నాను.
6 కలహప్రియునియొద్ద నేను చిరకాలము నివసించినవాడను.
7 నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చినతోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు.
← సూచికకు తిరుగు